జనం కోసం జన సేన పడిగాపులు


గుంటూరు : చేనేత నేతల బాధలని తీర్చడానికి  ఉన్నాను అంటూ జన సేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గుంటూరు లో జరిగిన సభకి హాజరు అయ్యారు. చేనేత సత్యాగ్రహానికి జనం భారీ సంఖ్యలో తరలి రాకపోవడంతో ప్రాంగణం వెలవెలబోయింది కనీసం 20 వేల మంది అయినా వస్తారన్న అంచనాతో గుంటూరు అర్బన్ పోలీసు శాఖ మూడు వందల మంది పోలీసులను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట సత్యాగ్రహానికి ఏర్పాటు చేసిన ప్రాంగణంలో బందోబస్తుకు నియమించారు. సభా ప్రాంగణం సామర్థ్యం రెండు లక్షలకు పైగా ఉంటుంది. అయితే సాయంత్రం నాలుగు గంటలకు కేవలం రెండు వేల మంది మాత్రమే ఉండటంతో పోలీసులు ఎలాంటి ఆంక్షలు విధించలేదు.ఎంతో భారీ ఆశలు పెట్టుకుని జన సేన నాయకులు నిరాశ పడిపోయారు. సభకు వచ్చే వాహనదారులను నేరుగా ప్రాంగణం వద్దకు అనుమతించారు. పవన్ కల్యాణ్‌ సభా ప్రాంగణానికి చేరే సమయానికి మూడు వేలకు మించి ప్రజలు లేరు. దీంతో ప్రజల కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీలు ఖాళీగా దర్శనమిచ్చాయి.
సభకు హాజరైన ప్రజల్లో సగం మంది ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ విద్యార్థులు. జనసేన కార్యకర్తలే. జనం హాజరు పలచగా ఉండటాన్ని సభలో చేనేత నేతలు శ్రీనివాసరావు, మూర్తి కూడా ప్రస్తావించారు. సభకు జనం రాకుండా చేయడంలో ప్రభుత్వం కుట్ర చేసిందని ఆరోపించారు. చేనేత సత్యాగ్రహానికి పవన కల్యాణ్‌ మద్ధతిచ్చినప్పటి నుంచి ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరుగెడుతోన్నాయని, సభ జరగకుండా చేసేందుకు ఎన్నో ఆటంకాలు కల్పించారని ఆరోపించారు. జనం పలచగా వచ్చినా పవన కల్యాణ్‌ ఒక్కరు కోటి మందితో సమానమని వ్యాఖ్యానించారు.
సభకి ప్రజలు రాకపోవడం కారణం పవన్ కళ్యాణ్ మాటల్లో నిజంలేదు అని అధికార పక్ష పార్టీలు అంటున్నారు అందుకే ప్రజలు ఆ సభ కి హాజరు కాలేదు అని వాఖ్యానించారు 

No comments:

Post a Comment

లోకేష్‌ మంత్రి పదవి తో టీడీపీకిలాభమెంత.?

కుమారుడికి మంత్రి పదవి ఇప్పించుకోవాలి..' అన్న ఏకైక లక్ష్యంతో మూడేళ్ళు కిందా మీదా పడి, ఎలాగైతేనేం.. నారా లోకేష్‌కి మంత్రి పదవి కట్టబె...