కుమారుడికి మంత్రి పదవి ఇప్పించుకోవాలి..' అన్న ఏకైక లక్ష్యంతో మూడేళ్ళు కిందా మీదా పడి, ఎలాగైతేనేం.. నారా లోకేష్‌కి మంత్రి పదవి కట్టబెట్టారు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. జాతీయ స్థాయిలో లోకేష్‌కి 'ఇమేజ్' తీసుకొచ్చేద్దామనుకుని, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టేశారాయన. కానీ, ఆ పదవిలో 'చినబాబు' ఒరగబెట్టిందేమీ లేదు. పైగా, తెలంగాణలో పార్టీని సర్వనాశనం చేసేశాడన్న ఆరోపణలు 'బోనస్'గా లభించేశాయి. .
మంత్రి పదవి పొందిన తరువాత నారా లోకేష్ చాల కష్టాలు పడుతున్నాడు ? ఏమిటి అనుకుంటున్నారా అదేనండి మన చిన్న బాబు తెలుగు మాట్లాడంలో చాలా కష్టపడుతున్నాడు . తండ్రి గారికి మంచి పేరు తెస్తాడు అనుకున్న చంద్రబాబు కి ఇప్పుడు గుండలో రైలు పరిగెడుతున్నాయి . తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు తనదైన శైలిలో ఇమేజ్ పెంచుకుంటా వెళ్తున్నాడు . అదే విధంగా మన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఊహించారు కానీ అది తీరడం లేదు . ఆ రాష్ట్ర ఐటీ మంత్రికి అన్ని భాషలు వస్తే మన రాష్ట్ర మంత్రికి ఒక్క తెలుగు బాషా మాట్లాడంలో గగనం అయిపోయింది . ఏమి జరుగుతుంది మరి చూడాలి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలో జాబ్స్ కోసం చాల మంది వేచి ఉన్నారు మన రాష్ట్ర ఐటీ మంత్రి ఇలా ఉన్నారు .






