ఏపీ కాపీపై దీటుగా స్పందిస్తాం తెలంగాణ ప్రభుత్వం!

ఏపీ కాపీపై దీటుగా స్పందిస్తాం తెలంగాణ ప్రభుత్వం!

ap copy ts

తెలంగాణ : ఒక స్కూల్ లో జరిగిన ఎక్సమ్ లో కాఫీ కొట్టారు అని టీచర్లు అంటారు లేదు నేను కాఫీ కొట్టలేదు అని విద్యార్థులు అనడం  చాలా స్కూల్లో జరుగుతాయి అలాగే  ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ ప్రభుత్వం రగడ జరుగుతుంది.   గత రెండు రోజుల నుంచి తెలంగాణ కాపీ పై పెట్టిన కేసులకు స్పందించిన ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం "ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌" బిజినెస్ పై తెలంగాణ సమాచారాన్ని ఏపీప్రభుత్వం కాపీ కొట్టిందన్న విషయం పక్కాగాఆధారాలు ఉన్నాయి అని తెలంగాణ  టి-పరిశ్రమల శాఖ తెలిపింది. ‘ఏపీ కాపీ’పై తాము దీటుగా స్పందిస్తామని పక్క ఆధారాలు  స్పష్టం చేస్తూ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయంలో తెలంగాణ అధికారులు చేస్తున్న ఆరోపణలను ఎదుర్కొంటున్న అక్కడి అధికారులను ఏపీ సర్కారు బెదిరింపులకు గురి చేస్తోందని. తెలంగాణ ప్రభుత్వం పెట్టే కేసులు, నోటీసులపై ఎవరూ స్పందించవద్దంటూ ఆదేశాలు జారీ చేసిందని. అధికారులెవ్వరూ నోరు మెదపవద్దంటూ ఏపీ ఆదేశాలు జారీ చేసిందంటేనే.. ఈవోడీబీ సమాచారాన్ని ఆ రాష్ట్రం దొంగిలించిందని నిర్ధారణ అయినట్లని తెలిపింది.మరి ఈ రెండు రాష్ట్రాల మధ్య రగడ ఎలా సర్దుమణుగుతుందో చూడాలి . గత సంవత్సరం తమ రాష్ట్రానికి 2 ర్యాంకు వచ్చిందని, 13వ ర్యాంకులో ఉన్న తెలంగాణ సమాచారాన్ని ఎలా కాపీ కొడతామంటూ ఏపీ చేస్తున్న వాదనలను పరిశ్రమల శాఖ ఖండించింది. ఈసారి డ్యాష్‌ బోర్డులో ఏపీ రాష్ట్రం ఎప్పుడూ అగ్రస్థానంలో లేదని, ప్రతిసారీ తెలంగాణ రాష్ట్రమే మొదటి 3 స్థానాల్లో నిలుస్తూ వచ్చిందని వివరించింది. ఈసారి అధమ స్థానంలో ఉన్న ఏపీ ఒకేసారి మూడో ర్యాంకులోకి ఎలా వచ్చిందో అన్న విషయాన్ని చెప్పకుండా.. గత సంవత్సరపు ర్యాంకుల ఆధారంగా సమర్థించుకోజూస్తోందని ఆరోపించింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపింది. ఈమేరకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఇరు రాష్ట్రాల కమిషనర్లు, వెబ్‌ అప్లికేషన సర్వీస్‌ ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేశారని పేర్కొన్నది. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ జేడీ సురేష్‌, రాష్ట్ర సర్వీస్‌ ప్రొవైడర్‌ ‘ఫక్స్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స ప్రైవేట్‌ లిమిటెడ్‌’ నిర్వాహకులు విచారణకు హాజరయ్యారని, సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసిన తేదీలు, ఇతర సమాచారాన్ని పోలీసులకు అందించారని తెలిపింది. ఎవరిని వదిలి పెట్ పరిస్థి లేదు అంటూ ఆ రాష్ట్ర అధికారులు తెలియచేశారు.
కాపీ చేయలేదని చెప్పిన ఏపీ సర్కారు నిజంగా ఏ పాపం చేయకపోతే విచారణకు సిద్ధం కావాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్కసుమన్‌ సవాల్‌ చేశారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ అధికారులు రూపొందించిన ఆన్లైన్ అప్లికేషన్లను చోరీ చేసి ఈవోడీబీ స్పూర్తిని దెబ్బతీసిన ఏపీ సర్కారుపై కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర అధికారులు మంత్రులు డిమాండ్‌ చేశారు.మరి దీని పై ఏ విధంగా ఏపీ ప్రభత్వం స్పందిస్తుందో చూడాలి 

No comments:

Post a Comment

లోకేష్‌ మంత్రి పదవి తో టీడీపీకిలాభమెంత.?

కుమారుడికి మంత్రి పదవి ఇప్పించుకోవాలి..' అన్న ఏకైక లక్ష్యంతో మూడేళ్ళు కిందా మీదా పడి, ఎలాగైతేనేం.. నారా లోకేష్‌కి మంత్రి పదవి కట్టబె...