బాహుబలి-2 క్లైమాక్స్?

బాహుబలి-2 క్లైమాక్స్?

bahubali2-images
హైదరాబాద్:  టాలీవుడ్ లో భారీ చిత్రం అంటే ముందుగా మనకి గుర్తువచ్చేది "బాహుబలి " ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో రికార్డులు క్రియేట్ చేసిన, తెలుగు సినిమా రంగానికే  ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఖ్యాతిని చాటిన తెలుగు ప్రజలు గౌరవంగా చెప్పుకోదగిన  చిత్రం ‘బాహుబలి’ . ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి జులై 10, 2015 న  తెర‌కెక్కించిన ఈ సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతున్న ‘బాహుబలి ద కన్‌క్లూజన్’ క్లైమాక్స్ షూటింగ్ ఈ సంవత్సరం  ఆగస్టులో పూర్తిచేసుకోనుంది. జూన్ 13న క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభించిన జక్కన  శరవేగంగా చిత్రీకరణ పూర్తిచేస్తున్నారు. ఈ పార్ట్ సినిమాకే హైలెట్ కానుందని బాహుబలి కంటే అద్భుతవం గా ఉంటుంది అని  తెలుస్తోంది. హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో యుద్ద సన్నివేశాలను రూపొందిస్తున్నారు. సినిమాలో కీలకమైన క్లైమాక్స్ సీన్లను రాజమౌళి ప్రతిష్టాత్మకంగా గుర్తుఉండే విధంగా  తెరకెక్కిస్తున్నారు. ఈ క్లైమాక్స్ సన్నివేశాల దాదాపు గా  రూ.30 కోట్లు వెచ్చిస్తున్నారని తెలుస్తోంది. "బాహుబలి" తొలి భాగం క్లైమాక్స్ కోసం రూ.10 కోట్లు ఖర్చు పెట్టగా అంత భారీ అంచనాలికి మించి ఆ చిత్రం వాసులు చేసింది అని . దానికి రెండింతల ఖర్చును రెండో భాగానికి వెచ్చిస్తున్నారు అని దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది అని భావిస్తున్నారు . అమెరికా మరియు హాలీవుడ్ స్టూడియోస్ నుంచి వచ్చిన టాప్ టెక్నీషియన్లతో ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణ జరుపుకుంటోంది జక్కన్న యూనిట్. ఈ సంవత్సరం ఆగస్టులో చిత్రీకరణ పూర్తిచేసుకుని. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకోనుంది అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. వచ్చే సంవత్సరం వేసవి కాలం లో ఈ చిత్రాన్ని విడుదల చేసే విధంగా జక్కన్న  పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు అని కధనాలు . ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.600 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ు చేసి రికార్డులకెక్కి జాతీయ అవార్డు,మరియు మరి ఎనో అవార్డ్స్ పొందిన  ఈ చిత్రం సీక్వెల్‌తో ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే. బాహుబలి కె అంకితం అయినా ప్రభాస్ ఈ  షూటింగ్ పూర్తికాగానే ప్రభాస్ సినిమాలతో బిజీ కాబోతున్నాడు అని . యంగ్ డైరెక్టర్ సుజిత్ సినిమా కోసం డిసెంబర్‌ నుంచి సెట్స్‌పైకి వెళ్లబోతున్నాడు అని సినిమా రంగం చెబుతుంది .

Amaravati Telugu News, Andhra Pradesh News, Bahubali2 Latest News, Bahubali News.

No comments:

Post a Comment

లోకేష్‌ మంత్రి పదవి తో టీడీపీకిలాభమెంత.?

కుమారుడికి మంత్రి పదవి ఇప్పించుకోవాలి..' అన్న ఏకైక లక్ష్యంతో మూడేళ్ళు కిందా మీదా పడి, ఎలాగైతేనేం.. నారా లోకేష్‌కి మంత్రి పదవి కట్టబె...